Friday, November 22, 2024
HomeతెలంగాణSidhipeta: బీఫార్మసీ కాలేజ్ ప్రారంభించిన మంత్రులు

Sidhipeta: బీఫార్మసీ కాలేజ్ ప్రారంభించిన మంత్రులు

ఎడ్యుకేషన్ హబ్ గా సిద్ధిపేట

సిద్దిపేట చిన్నకోడూరు మండలంలోని రామాంచలో నూతనంగా నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి బీఫార్మసీ కళాశాలను ప్రారంభించారు మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ స్థానిక ప్రజాప్రతినిధులు, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ: నియోజకవర్గంలో ఫార్మసీ కాలేజ్ శంకుస్థాపనకు వచ్చిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు. సిద్దిపేటలో బీఫార్మసీ కాలేజ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. 8 నెలల్లో అన్ని రకాల అనుమతులు తీసుకొని ఈ సంవత్సరం కాలేజీని ప్రారంభించుకోవడం గొప్ప విషయం. విద్యాలయాలకు ఆలయం సిద్దిపేట.

అన్ని రకాల చదువులతో ఈరోజు సిద్దిపేట జిల్లా విరాజిల్లుతోంది. మెడికల్ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఇలా అన్ని రకాల విద్యలు సిద్దిపేటలో అందుబాటులో ఉన్నాయి. సిద్దిపేట ఒకటే కాదు తెలంగాణలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ప్రతి గ్రామం తెలంగాణలో అభివృద్ధి చెందుతున్నాయి. ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ no1 గా ఉంది. ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబిబిఎస్ సీట్లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ ఐటీ అని మాత్రమే అనేవారు. అదే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో హైదరాబాదులో ఐటీతో పాటు గ్రామాల్లో వ్యవసాయం కూడా పెరిగింది. ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ నెంబర్వన్ గా ఉంది.


తెలంగాణ వచ్చినప్పుడు 3 లక్షల ఐటి ఉద్యోగాలు ఉంటే ఈరోజు 10 లక్షల ఐటీ ఉద్యోగాలకు తెలంగాణ నిలయంగా మారింది. ఈ రోజు హైదరాబాదు నగరంలో ఎలాంటి సౌకర్యాలు అయితే ఉన్నాయో అదేవిధంగా మారుమూల గ్రామంలో కూడా అవే సౌకర్యాలు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. దేశంలో కోతలు లేకుండా 24 గంటల కరెంటు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారు. దేశంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అభివృద్ధిలో సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర భాగాన నిలిచే అందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోటీ పడుతుంటే ప్రతిపక్షాలు మాత్రం తిట్టడంలో పోటీ పడుతున్నాయి. ఇదే స్ఫూర్తితో ముందుకు పోతాం. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా మరింత మంచి కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తాం. హైదరాబాదులో మాత్రమే జరిగే ఎగ్జిబిషన్లను ఇప్పటినుంచి అన్ని జిల్లాల్లో నిర్వహించాలని నిర్ణయించాం. మహిళా విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసింది ఎగ్జిబిషన్ సొసైటీ. ఎంతో మందికి విద్యను ఉపాధిని కల్పిస్తుంది ఎగ్జిబిషన్స్ సొసైటీ.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ: ఇంతటి గొప్ప కార్యక్రమంలో ప్రేమతో నన్ను భాగస్వామ్యం చేసిన మంత్రి హరీష్ రావు గారికి ధన్యవాదాలు. ఈ బీఫార్మసీ కాలేజ్ అన్ని అనుమతులు పొంది ఈరోజు ప్రారంభించుకోవడం అంటే దాని వెనుక మంత్రి హరీష్ రావు గారి కృషి తప్పకుండా ఉంది. దేశమంతా అభివృద్ధిలో తెలంగాణనే మోడల్ అని చెప్తుంటే తెలంగాణకే సిద్దిపేట మోడల్ గా నిలిచింది. మంత్రి హరీష్ రావు గారు ఇప్పుడే కాదు ఉద్యమ సమయంలో కూడా మేము అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావు ఎక్కడ ఏ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు అని ప్రభుత్వం పరిశీలించేది. ఉద్యమంలో ఏదైతే ఆరాటం, తపన ఉండేదో ఇప్పుడు కూడా అదే కమిట్మెంట్ తో ఉన్నారు హరీశ్ రావు గారు. సిద్దిపేటలో హరీష్ రావు గారి మెజార్టీతో ఎవరూ పోటీ కూడా పడే పరిస్థితిలో ఉండరు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేజీ టు పీజీ విద్య అనే చెప్పారు. అది ఇంప్లిమెంట్ చేసేందుకే మేమంతా కృషి చేస్తున్నాం. తొమ్మిది సంవత్సరాలలో 1000 గురుకులాలు ఏర్పాటు చేసి దేశంలోనే ఎక్కడా లేని విధంగా నాణ్యమైన విద్య ఈరోజు అందిస్తున్నాం. ఈ 9 ఏ ఎండ్లలో 1450 గురుకుల జూనియర్ కాలేజీలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముందునుండి మహిళ విద్య కోసం పాటుపడే ఎగ్జిబిషన్ సొసైటీకి నా అభినందనలు. త్వరలో ముఖ్యమంత్రి గారు మహిళా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఆడపిల్లల చదువుకు ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News