Friday, September 20, 2024
HomeతెలంగాణSidhipeta: డివైడర్లు, చెట్లు, రోడ్స్, మెరుపులేనా అభివృద్ధంటే?

Sidhipeta: డివైడర్లు, చెట్లు, రోడ్స్, మెరుపులేనా అభివృద్ధంటే?

నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది ?

కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తల త్యాగమే వారి కృషితోనే అధిష్టానం సిద్దిపేట నియోజకవర్గ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణ జిల్లా కేంద్రంలోని తాడూరి బాలాగౌడ్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. టికెట్ కేటాయించినందుకు అధిష్టానానికి, పార్టీ నేతలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మెరుగైన వైద్యం అందజేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష రావు ఇటీవల దుబ్బాక నియోజకవర్గ బీఆర్ ఎస్ అభ్యర్థి కెపిఆర్ కత్తి పోటుకు గురైతే వైద్యం కోసం సిద్దిపేటకు తీసుకరాకుండా హైద్రాబాద్ కి ఎందుకు తీసుకొనివెళ్లారని మండిపడ్డారు. పేద వాడికి ఒక వైద్యం, ఉన్నోడికి ఓ వైద్యమా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సిద్దిపేట అభివృద్ధి అంటే రోడ్స్, డివైడర్లు, చెట్లు, కోమటిచేరువు మెరుపులు కాదు ప్రజలకు కావలసిన స్థితి గతులు మెరుగుపడినప్పుడే నిజమైన అభివృద్ధి అని అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు బీ ఆర్ ఎస్ అబద్ధాలను నమ్ముకుని అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ నిజం నమ్ముకుని ప్రజల ముందుకు వస్తున్నామని తెలిపారు. హరీష్ రావు అరాచకాలు ఎండగడతామని హెచ్చరించారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమలు చేస్తామని అన్నారు. యువకులను బీరు, బిర్యానీలకు అలవాటు చేసి పార్టీలో తిప్పుకుంటూ యువకుల జీవితాలతో చేలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దళిత బంధు అంటూ దళితులను, బీసీ బంధు అంటూ బీసీలను , దళితులకు మూడెకరాల ఇస్తామని మోసపూరిత మాటలు చెపుతూ ప్రజలను మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న బీ ఆర్ ఎస్ పార్టీకి ఎన్నికల్లో తగు గుణ పాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు ఆత్తు ఇమాం, టీపీసీసీ సభ్యులు దర్పల్లి చంద్రం, మహేందర్, నాయకులు బొమ్మల యాదగిరి, నాగరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలు లక్ష్మీతో పాటు నియోజకవర్గoలోని ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News