Friday, September 20, 2024
HomeతెలంగాణSinagareni: సత్తుపల్లి-కొత్తగూడెం నూతన రైలు మార్గం

Sinagareni: సత్తుపల్లి-కొత్తగూడెం నూతన రైలు మార్గం

కేటీపీఎస్‌, ఐటిసి, నవభారత్‌, బిటిపిఎస్‌ ఇండస్ట్రీలు రావడానికి సింగరేణి ప్రధాన కారణం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సావాల్లో భాగంగా సింగరేణి కాలరీస్‌లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో అత్యధికంగా వనరులు చేకూర్చే సింగరేణి ప్రాంతానికి మంచి జరిగిందన్నారు. ఈ ప్రాంతానికే కాదు రాష్ట్రానికి, దేశానికి కూడా చాలా మంచి జరిగిందన్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఖమ్మంలో ఉన్న ఏకైక ఇండస్ట్రీ సింగరేణి ఇండస్ట్రీ అని అన్నారు. అతిపెద్ద సింగరేణి మైనింగ్‌ ఇండస్ట్రీ మన ప్రాంతంలో ఉండటం అదృష్టం అన్నారు. స్థానిక శాసనసభ్యులు సింగరేణి ప్రభావిత ప్రాంతాల గురించి, చిన్న చిన్న సమస్యల గురించి ఎప్పుడూ నా దృష్టికి తీసుకుని వస్తుంటారు అని తెలిపారు. డిస్టిక్‌ మినరల్‌ ఫండ్‌ నుంచి 455 పనులు 183 కోట్లుతో మంజూరు చేయడమే కాకుండా పూర్తిచేశామన్నారు. సిఎస్‌ఆర్‌ నిధుల నుంచి 33 కోట్లు అభివృద్ధికి ఉపయోగించామన్నారు.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగరేణి వచ్చే ఆదాయాన్ని సింగరేణి ఇండస్ట్రీ ఉన్న ప్రాంతంలోని ప్రజల అభివృద్ధికి ఉపయోగించడం జరగాలని తెలిపిందన్నారు. ఈ ఇండస్ట్రీ వల్ల నివాసులకు కొంత ఇబ్బందుల ఎదురవుతున్నాయని స్థానిక శాసన సభ్యులు మా దృష్టికి తీసుకువచ్చామన్నారు. దీనిపైన త్రీ మ్యాన్‌ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో సింగరేణి సంస్థ సత్తుపల్లి ప్రాంతం నుంచి కొత్తగూడెం ప్రాంతం వరకు నూతనంగా రైలు మార్గం ఏర్పాటు చేసి బొగ్గు రవాణాకు ప్రత్యేకంగా ఒక రైలును ఏర్పాటు చేసిందన్నారు. ఈ రైలు మార్గం వలన భవిష్యత్తులో సత్తుపల్లి టు కొత్తగూడెం ప్యాసింజర్‌ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. గతంలోని కొత్తగూడెం (భద్రాచలం) రైలు మార్గం కూడా అలాగే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అన్నారు. సింగరేణి ఇండస్ట్రీ వలన ఉపాధి అవకాశాలు పెంపొందాయి అన్నారు. కొత్తగూడెంలోని కేటీపీఎస్‌, ఐటిసి, నవభారత్‌, బిటిపిఎస్‌ ఇండస్ట్రీలు రావడానికి సింగరేణి ప్రధాన కారణమన్నారు. విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గు ప్రధాన కారణం అని, ఆ బొగ్గు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లభ్యం అవ్వడం మనందరి అదృష్టమన్నారు. దీనివలన విద్యుత్‌ ఉత్పత్తికి ఎటువంటి డోకా లేదన్నారు. 24 గంటల విద్యుత్‌ సరఫరాకు మన ప్రాంతంలో లభించే బొగ్గే ప్రధాన కారణమన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సింగరేణి యాజమాన్యానికి ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.


సింగరేణి ఉత్సవాల సంబరాల్లో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తు కలిగిన సింగరేణి సంస్థను కాపాడుకోవడంలో మనమందరం భాగస్వామ్యం కావాలన్నారు. సింగరేణి ఎండి శేఖర్‌ ఇతర రాష్ట్రాల్లో బొగ్గు గనులను వెలికి తీసేలా ఒరిస్సా వైపు అడుగులు వేశారన్నారు. సింగరేణి మన ప్రాంతంలో ఉండబట్టే మన ప్రాంత అభివృద్ధికై రిజర్వేషన్లు సిఎస్‌ఆర్‌, ఎమ్డిఎఫ్‌ ఫండ్స్‌ వస్తున్నాయన్నారు. సత్తుపల్లి అభివృద్ధికి 100 కోట్ల నిధులను సింగరేణి అందించడం మామూలు విషయం కాదన్నారు.
కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ కె.మహేష్‌, కమీషనర్‌ సుజాత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, సత్తుపల్లి ఏ.సిపి బి.రామానుజం, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జ్యోతి, కల్లూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారి సూర్యనారాయణ, తహశీల్దారు శ్రీనివాసరావు, ఎం.పి.డి.ఓ శుభాసిని, ఎంపీపీలు హైమావతి, అలేఖ్య, జడ్పీటీసీలు కట్టా అజయ్‌ కుమార్‌, మోహనరావు , సింగరేణి సంస్థ యూనియన్‌ ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యుత్‌ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News