Singareni announces bonus for workers: సింగరేణి కార్మికులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏటా అందించేలానే కార్మికులకు ప్రభుత్వం దసరా బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34 శాతం పంచాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నిర్ణయంతో వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలకు దసరా ఖర్చుల కోసం ఆర్థికం సాయం లభించనుంది.
దసరా దావత్ కోసం ఆర్థికంగా చేయూత: దసరా పండుగ సందర్భంగా సింగరేణి సంస్థ తమ కార్మికులకు శుభవార్త అందించింది. ఏటా లాగే ఈసారి కూడా దసరా అడ్వాన్స్‌ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లాభాల్లో 34 శాతం పంచాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా 41 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులకు రూ.1,95,610 చొప్పున బోనస్ ఇస్తున్నట్లు వెల్లడించారు. 30 వేల మంది ఒప్పంద కార్మికులకు రూ.5,500 చొప్పున చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలకు దసరా ఖర్చుల కోసం ఆర్థికంగా చేయూత లభించనుంది. దసరా అడ్వాన్స్ విడుదల అనేది సింగరేణి సంస్థలో ఒక సంప్రదాయంగా వస్తుంది. పండుగ సమయంలో కార్మికుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని సింగరేణి సంస్థ యాజమాన్యం తీసుకుంటారు. ఈసారి సైతం అదే విధానాన్ని కొనసాగిస్తూ.. అధికారులు త్వరగా అడ్వాన్స్ చెల్లింపులకు ఏర్పాట్లు చేశారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/kavitha-bathukamma-celebrations/
కుటుంబాల్లో సంతోషం: సింగరేణి సంస్థలో సుమారు 41,000 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వం సింగరేణి కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది. బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు దసరా లాంటి పండుగల సమయంలో సంస్థ ఇచ్చే ఇలాంటి ప్రోత్సాహకాలు ఎంతో ఉపయోగపడతాయని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండుగకు కావలసిన కొత్త దుస్తులతో పాటుగా దావత్‌కు కావాల్సిన ఇతర ఖర్చుల కోసం ఈ అడ్వాన్స్ డబ్బులు వారికి అండగా ఉంటాయి.
మరోసారి చాటి చెప్పిన సింగరేణి: ఈ నిర్ణయం సంస్థ యాజమాన్యానికి, కార్మికుల మధ్య ఉన్న సత్సంబంధాలను మరోసారి సింగరేణి సంస్థ చాటి చెప్పింది. ఇలాంటి నిర్ణయాలు కార్మికుల పనితీరును మెరుగుపరచడానికి దోహదపడతాయని యాజమాన్యం తెలిపింది. దసరా అడ్వాన్స్ చెల్లింపుల కోసం సింగరేణి అధికారులు అన్ని బ్యాంకులతో సమన్వయం చేసుకుని ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.


