Friday, November 22, 2024
HomeతెలంగాణSingareni: ఆర్కే-7 గనిని సందర్శించిన చెన్నూర్ సివిల్ న్యాయమూర్తి

Singareni: ఆర్కే-7 గనిని సందర్శించిన చెన్నూర్ సివిల్ న్యాయమూర్తి

కార్మికుల కష్టాని మాటల్లో చెప్పలేం

శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-7 గనిని చెన్నూరు పట్టణం జూనియర్ సివిల్ న్యాయమూర్తి సిహెచ్ సంపత్ ఆర్కే-7 గనిని సందర్శించారు. ఈ సందర్భంగా గని మేనేజర్ సాయి ప్రసాద్, జూనియర్ సివిల్ న్యాయమూర్తి సిహెచ్ సంపత్ లను ఆహ్వానించారు. అనంతరం న్యాయమూర్తి వారి సిబ్బందితో గనిలోకి దిగారు. చెన్నూరు పట్టణం జూనియర్ సివిల్ న్యాయమూర్తి సిహెచ్ సంపత్ వెంట గని రక్షణ అధికారి రవిశంకర్ వెళ్లి గనిలో కార్మికులు చేపడుతున్న పనుల గురించి, కార్మికులు బొగ్గు తీసే విధానాన్ని కార్మికుల రక్షణకు చేపడుతున్న చర్యల గురించి గని రక్షణ అధికారి రవిశంకర్ వివరించారు. ఈ సందర్భంగా చెన్నూరు పట్టణం జూనియర్ సివిల్ న్యాయమూర్తి సిహెచ్ సంపత్ మాట్లాడుతూ… గనిలోకి దిగి అక్కడ కార్మికులు చేస్తున్న పనులను గురించి తెలుసుకున్నారు. కార్మికుల కష్టాన్ని చూసానని భారతదేశానికి వెలుగులు నింపే కార్మికులు దేశ సైనికులతో సమానమని 300 నుండి 400 మీటర్ల లోతులోకి వెళ్లి పకృతికి విరుద్ధంగా భూమి నుండి బొగ్గును వెలికితీస్తున్న కార్మికుల కష్టాని మాటల్లో చెప్పలేమని వారు అన్నారు. ఆర్కే-7 గనిలో చేపడుతున్న రక్షణ చర్యలు, కార్మికుల సంక్షేమ కోసం అధికారులు చేపడుతున్న పనులు చాలా బాగున్నాయని గనిలోకి దిగడం చాలా సంతోషంగా ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఎస్సై కే.రాజేష్, గని సంక్షేమ అధికారి సంతన్, అడ్వకేట్ సంపత్, కోర్టు సిబ్బంది డి.శేఖర్, కే.సప్న, కే.నిర్మల పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News