Saturday, November 23, 2024
HomeతెలంగాణSingareni: గైర్హాజరు ఉద్యోగులకు కౌన్సిలింగ్

Singareni: గైర్హాజరు ఉద్యోగులకు కౌన్సిలింగ్

సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఆర్కే-7 గని లో విధులు నిర్వహిస్తు గైర్హాజరైన ఉద్యోగులకు అధికారులు కౌన్సిలింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిలింగ్ కార్యక్రమానికి ఆర్కే-7 గ్రూపు ఏజెంట్ మాలోత్ రాముడు, గని మేనేజర్ సాయి ప్రసాద్, డీజిఎం ఐఈడి చిరంజీవులు, గుర్తింపు సంఘం పిట్ సెక్రెటరీ మేండే వెంకటి, ఆర్కే-7 గ్రూప్ ఆఫీసర్ ప్రకాష్ పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగులను ఎందుకు గైర్హాజరు అవుతున్నారో వారి యొక్క ఇబ్బందులను గురించి తెలుసుకుంటూ ఉద్యోగులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ… సింగరేణి సంస్థలలో ఉద్యోగం రావడం చాలా గొప్ప విషయమని సరిగా విధులకు హాజరు కాకపోతే కుటుంబపరంగా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని దానివల్ల చాలా నష్టపోయే అవకాశం ఉంటుందని సమాజంలో కనీసం గౌరవం కూడా ఉండదని సంవత్సరానికి కనీసం 100 మాస్టర్లు చేయాలని సూచించారు. ఈ కౌన్సిలింగ్ ద్వారా మీలో మార్పు రావాలని భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉంటే మీ ఉద్యోగం కూడా కోల్పోయా అవకాశం ఉంటుంది అని వారు తెలియజేశారు. గనుల్లో గైర్హాజరును తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉద్యోగుల హాజరు పెరిగితే ఉత్పత్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమాధికారి సంతన్, ఆఫీసు సూపర్డెంట్ ఇస్మాయిల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News