సింగరేణి కార్మికులకు చారిత్రాత్మకమైన వేతన ఒప్పందం అమలు జరిగిందని బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 గని ద్వార సమావేశంలో బిఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం రమేష్ తో కలిసి మాట్లాడారు… జెబిసిసిఐ సమావేశంలో కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం అలవెన్సులు సాధించటం చారిత్రాత్మకమైన ఒప్పందమని బొగ్గు పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులందరికీ బలమైన ఆర్థిక ప్రయోజనం ఉంటుందని అన్నారు. మొండిగా వ్యవహరించిన కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు దిగివచ్చే విధంగా భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రతినిధులు పనిచేస్తున్నారని తెలియజేశారు. మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్ 20శాతం, సాధించడం 4శాతం ఉన్న కోల్ ఫీల్డ్ అలవెన్సును 5శాతానికి పెంచడం 24శాతం మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్ సాధించామని, అలవెన్సులపై 25శాతం అంగీకారం కుదిరిందని అండర్ గ్రౌండ్ అలవెన్స్ 9శాతం ఫ్రీజింగ్ లో ఉన్న 11.25 శాతం వరకు అంగీకారం కుదిరిందని వివరించారు. రెండు శాతం ఉన్న హెచ్ఆర్ఏను 2.5 శాతం పెంచినారని, అలవెన్సులు ఇంక్రిమెంట్ 3శాతం డిపెండెంట్ ఉద్యోగులకు మౌలిక సదుపాయాలు, కార్మికుల ఉద్యోగ భద్రత సామాజిక భద్రత కార్పోరేట్ స్థాయి వైద్య, విద్యా సదుపాయాలు కల్పించుటకు మెరుగైన వేతన ఒప్పందంతో పాటు అలవెన్స్ పెరుగుదలకు కృషి చేశామని తెలిపారు. పెరిగిన జీతభత్యాలు, జూన్ లో అమలు అవుతాయని, త్వరలో ఎరియర్స్ బకాయిలు అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు, సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్తు బొగ్గు బకాయిలు 25 వేల కోట్ల రూపాయలను తక్షణమే చెల్లించుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం గని వద్ద కార్మికులు బాణా సంచాలు కాల్చుతు సంబరాలు చేసినారు. ఈ సమావేశంలో ఏరియా కార్యదర్శి నాతాడి శ్రీధర్ రెడ్డి, కేంద్ర కమిటీ నాయకులు మాదాసి రవీందర్, మంచినీళ్ల స్వామి, జీడి ప్రభాకర్, జోగుల ప్రభాకర్, కాదాసి భీమయ్య, పాగిడి శ్రీకాంత్, మంద కమలాకర్, మేకల స్వామి, సురేష్ చల్ల ప్రశాంత్ రెడ్డి, తిరుపతి, నరేష్, వినోద్, రాజేంద్రప్రసాద్, నీరెటి శ్రావణ్, సంజీవ్ సోమయ్య, పవన్ తదితరులు పాల్గొన్నారు.