Friday, September 20, 2024
HomeతెలంగాణSingareni: రోజువారి ఓబి ఉత్పత్తిని సాధించాలి

Singareni: రోజువారి ఓబి ఉత్పత్తిని సాధించాలి

రోజువారి ఓబి ఉత్పత్తిని సాధించాలని సింగరేణి ప్రాజెక్టు అండ్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును ఏరియా జిఎం బి.సంజీవరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీరాంపూర్ ఉపరితల గని రోజువారి ఓబి ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి, అదేవిధంగా బొగ్గు ఉత్పత్తి రవాణా సరైన సమయంలో చేయాలని అన్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకతను సాధించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఓబి కాంట్రాక్టు కంపెనీ వారితో మాట్లాడి ఓబీ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఉపరితల గని ప్రాజెక్టు ఆఫీసర్ పురుషోత్తం రెడ్డి, ఇందారం ఉపరితల గని ప్రాజెక్టు అధికారి ఎం.శ్రీనివాస్, ఇంచార్జ్ మేనేజర్లు శ్రీనివాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News