రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని సింగరేణి కార్మిక్షేత్రమైన ఆర్జీ-1 ఒసిపి-3 సీ.ఎస్.పి మరియు ఆర్జీ-2 ఎరియా వర్కషాప్ లలో కందుల సంధ్యారాణి రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కార్మికులని కలిసి రాఖీలు కట్టారు. అనంతరం మాట్లాడుతూ నిజజీవితంలో అన్నదమ్ములు లేని నాకు సింగరేణి కార్మికులనే అన్నదమ్ముల్లుగా భావించుకుంటూ ప్రతీ సంవత్సరం సింగరేణి కార్మికుల మధ్యనే రాఖీ వేడుకలు జరుపుకుంటున్నా అని అన్నారు.
కార్మికుల సహకారంతోనే రాజకీయ రంగంలో ముందుకు సాగుతున్నాం అన్నారు. మీ ఆశీర్వాదం, తోడ్పాటు ఎల్లవేళలా ఈ ఆడబిడ్డకి అందించాలని కార్మికులని కోరారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో నీతీ, నిజాయితీగా ఈ ప్రాంత అభివృద్ది,సంక్షేమం కోసం కృషి చేసాం అన్నారు. ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా ముందుండి వారికి అండగా నిలబడ్డామన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు గర్వపడే విధంగా మా పరిపాలన కొనసాగించామన్నారు. భవిష్యత్తులో సింగరేణి కార్మికులకి అండగా ఉంటూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంపూర్ణ, రజిత, మంగ, రాజేశ్, విజయ్, పెద్ది సమ్మయ్య, శ్రీనివాస్, రాజబాబు, రామ్ చందర్, సత్యనారాయణ, మల్లయ్య, చంద్రయ్య కార్మికులు పాల్గోన్నారు.