Sunday, September 22, 2024
HomeతెలంగాణSingareni: తొమ్మిదేళ్లలో సంస్థలో అద్భుత ప్రగతి

Singareni: తొమ్మిదేళ్లలో సంస్థలో అద్భుత ప్రగతి

అమ్మకాలలో 176% వృద్ధి, ఉత్పత్తిలో 33% వృద్ధి, రవాణాలో 39% వృద్ధి మహారత్న కంపెనీలతో పోలిస్తే టర్నోవర్ లో రెండవ స్థానం తెలంగాణ ఏర్పాటు తర్వాతనే అద్భుత ప్రగతి ముఖ్యమంత్రి ఆదేశంతో 19 వేలకు పైగా కొత్త నియామకాలు ప్రస్తుత సింగరేణి ఉద్యోగుల్లో 45 శాతం యువతే ఉందన్నారు సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత తొమ్మిదేళ్లలో సింగరేణి అన్ని రంగాలలో అత్యద్భుతమైన ప్రగతిని సాధించిందని, సంక్షేమంలో కూడా దేశంలో గల అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఆదర్శప్రాయంగా నిలిచిందని శ్రీధర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ సింగరేణి భవన్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణికి 134 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత తొమ్మిది సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి దిశా నిర్దేశంలో గతంలో ఎన్నడూ సాధించని అత్యుత్తమ వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాకపూర్వం సింగరేణి సంస్థ టర్నోవర్ 11,928 కోట్లు ఉండగా గత తొమ్మిది సంవత్సరాల్లో 176% వృద్ధితో గత ఏడాది 32వేల 978 కోట్లకు పెరిగిందని ఇంతటి వృద్ధిని దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు సాధించలేదని, మహారత్న కంపెనీతో పోల్చి చూస్తే సింగరేణి ద్వితీయ స్థానంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాకపూర్వం 2014లో 419 కోట్ల రూపాయల లాభాలు గడించిన సింగరేణి గత ఏడాది 421 శాతం వృద్ధితో 2,184 కోట్ల రూపాయల లాభాలను గడిచిందని, ఇది కూడా మరే ఇతర ప్రభుత్వ సంస్థ సాధించని ఘనమైన వృద్ధి అని పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తిలో 33% బొగ్గు రవాణాలో 39% వృద్ధిని సాధించామని, గడచిన తొమ్మిదేళ్లలో 14 కొత్త గనులను ప్రారంభించుకున్నామని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించిన సంస్థ కూడా సింగరేణి సంస్థ అని వివరిస్తూ, ఇప్పటివరకు 19,463 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. వీటిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ కింద 15,250 మంది వారసులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News