సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎస్.సి.డబ్ల్యూ.య., ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలను పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆగస్టు 25,26,27 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు ఆర్కే-6 గని ఫిట్ సెక్రెటరీ సదానందం. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ మహాసభలో ఉద్యోగస్థులు అందరూ పాల్గొని సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభ 25 వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు గోదావరిఖని చౌరస్తాలో కార్మిక వర్గమంతా అధికంగా పాల్గొని బహిరంగ సభ విజయవంతం చేయలన్నారు. 1942 మే ఒకటవ తేదీన కామ్రేడ్ శేషగిరిరావు, మాగడో
మగ్దుమ్ మొయినుద్దీన్, సర్వదేవపట్ల రామనాథం, మనుబోతుల కొమురయ్య లాంటి మహా నాయకులు ఏర్పాటు చేసిన మొట్టమొదటి సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ముక్క వోని ధైర్యంతో గత 81 సంవత్సరాలుగా సింగరేణిలో అనేక పోరాటాలు చేసి కార్మిక వర్గానికి అనేక హక్కులు సాధించిన చరిత మన యూనియన్. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ తోట మహేష్, జాయింట్ ఫిట్ సెక్రెటరీ కారుకూరి నగేష్, షిఫ్ట్ సెక్రటరీ సంతోష్ రాజేష్ లవన్, దాసరి రాజేశం, రమేష్, ప్రకాష్ తదితరు నాయకులు పాల్గొన్నారు.
Singareni: రాష్ట్ర మహాసభల పోస్టర్ విడుదల
ఆర్కే-6 గని ఆవరణలో వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఫిట్ సెక్రటరీ