తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయని వాటిని ప్రజలు గమనించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన 2 వేల మంది పెయింటర్స్, భవన ఫ్లోరింగ్ కార్మికులు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంచిరావుపల్లి గ్రామం నుండి, ఎంఎస్ఎఫ్ నుండి, ఏఐఎస్ఎఫ్ నుండి బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల కార్యకర్తలు .. వివిధ సంఘాల నాయకులు ..కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో 9 ఏళ్లలో వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలని అన్నారు. ఈ రోజు ఎక్కడా భూమి భీడుగా లేదనిఏ పని చెయ్యని వారికంటే కాయాకష్టం చేసేవారే గొప్పవాడు అని గుర్తు చేశారు. విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించడం లక్ష్యంగా అనేక విద్యాలయాలు వనపర్తికి తీసుకువచ్చామని అన్నారు. వనపర్తిని జిల్లా చేయడం మూలంగా 54 శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారనీ అన్నారు. తెలంగాణలో 65 లక్షల కుటుంబాలకు రూ.72 వేల కోట్లు రైతుబంధు అందించినట్టు తెలిపారు.
తెలంగాణ వస్తే ఏం వస్తుంది అన్న దానికి ప్రతి ఒక్కరికి పని లభించడమే నిదర్శనం అని అన్నారు. రోడ్లు, తాగునీరు, కరంటు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా, వితంతు, దివ్యాంగుల ఫించన్లు, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదనీ అన్నారు. పెద్దఎత్తున కరెంటు నిరంతరాయ సరఫరా కోసం సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. రైతుబంధు, రైతుభీమా పథకాలతో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్నదనీ అన్నారు. గతంలో సేద్యం చేయాలంటే కరువు కాటకాలతో సాగునీరు లేక, కరెంటు రాక చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారనీ గుర్తు చేశారు. వ్యవసాయం వదిలేసి పొలాలు బీడు పెట్టి మట్టి పనులకు, తట్టి పనులకు వెళ్లేదనీ, మూడు నెలల కోసారి రేషన్ కార్డు పంపి కంట్రోల్ బియ్యం తీసుకోమని గ్రామంలో ఉన్న వారికి చెప్పి బియ్యం తీసుకుని వెళ్లేదనీ అన్నారు. తెలంగాణ రాక ముందు 10, 20 ఎకరాలు ఉన్న వారు కూడా ఎన్నడూ సక్కగ బతికింది లేదు .. పట్నం వెళ్లి పనులు చేసుకునేదనీ,
పేదోడు కనిపించేలా పనిచేస్తే .. పెద్దోడు కనిపించకుండా కష్టం చేసుకుని జీవనం వెళ్లదీసుకున్నార నీ గుర్తు చేశారు.ఆ స్థితి నుండి నేడు ఎకరా భూమి ఉన్న రైతు కూడా తన భూమి తను చేసుకుని, ఖాళీ సమయంలో కూలీ చేసుకుని గ్రామంలో సుఖంగా జీవించగలిగే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లోకి వినోద్,కళ్యాణ్, రామకృష్ణ, రాఘవేంద్ర, బాలకృష్ణ, బాలరాజు, రాజు, విజయ్, చిన్న, శ్రీను,కాంగ్రెస్ మాజీ ఎస్స.సెల్ జిల్లా కన్వీనర్ కొమ్ము చెన్నయ్య, ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ G.రాజేష్, ఎంఎస్ఎఫ్ జిల్లా కో కన్వీనర్ D.శ్రీనాథ్, M.శివ టౌన్ ప్రెసిడెంట్, AISF…D.Rambabu జిల్లా మాజీ Convinor, G.హరీష్…AISF town ప్రెసిడెంట్ లా అద్వ్యర్యం నియోజక వర్గం లో నీ అన్ని మండలాల అధ్యక్షులతో కలిసి 300 మందితో భారీ చేరారు.