Sunday, November 10, 2024
HomeతెలంగాణSingireddy Niranjan Reddy: వనపర్తిని అభివృద్ధిలో నిలపడమే నా లక్ష్యం

Singireddy Niranjan Reddy: వనపర్తిని అభివృద్ధిలో నిలపడమే నా లక్ష్యం

వనపర్తిని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా

వనపర్తిని అభివృద్దిలో ముందంజలో నిలపడమే నా లక్ష్యం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వివిధ రకాల పనులకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిందని, నియోజకవర్గంలోని 9 వంతెనల నిర్మాణానికి రూ.40.50 కోట్లు, ముఖ్యమంత్రి నిధుల నుండి వనపర్తి పెబ్బేరు రహదారికి రూ.48.50 కోట్లు మంజూరైనట్టు తెలిపారు. కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాల పునరుద్దరణ, బాలుర, బాలికల నూతన భవనాల నిర్మాణం కోసం రూ.22 కోట్లు, వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని సీసీ రహదారులు, డ్రైనేజీల  నిర్మాణానికి రూ.15 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ నుండి నూతనంగా 13  గ్రామీణ రహదారుల నిర్మాణానికి రూ.21.30 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
వనపర్తి  – ఘణపూర్ రహదారిలో 2, పెబ్బేరు – యాపర్ల రహదారిలో 2, గోపాల్ పేట  – నాగర్ కర్నూలు రహదారిలో 1, పెద్దమందడి  – జాతీయ రహదారి 7 మీద 4 వంతెనల నిర్మాణం,పెద్దమందడి మండలం మణిగిల్ల  – బుగ్గపల్లి తండాల మధ్యన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.50 కోట్లు, పెద్దమందడి  మండలం దొడగుంటపల్లి  – అంకూరు  నూతన రహదారికి రూ.90 లక్షలు,గోపాల్ పేట మండలం గొల్లపల్లి  – రేవల్లి రహదారికి రూ.1.80 కోట్లు,శ్రీరంగాపూర్ మండలం నాగరాల గ్రామంలో సెంటర్ 2 నుండి 3 వరకు రహదారికి రూ.1.25 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. శ్రీరంగాపూర్ మండలం నాగసానిపల్లి  – శ్రీరంగాపూర్ రహదారికి రూ.1.30 కోట్లు,
పెబ్బేరు మండలం తిప్పాయపల్లి  – గుమ్మడం క్రాస్ రోడం వరకు రహదారి నిర్మాణానికి రూ.1.85 కోట్లు,
పెబ్బేరు మండలం రంగాపూర్  – రాంపూర్ రహదారి నిర్మాణానికి రూ.2.56 కోట్లు,
పెబ్బేరు మండలం రాంపూర్  – రామన్నపేట రహదారికి రూ.1.52 కోట్లు,
పెబ్బేరు మండలం బున్యాదిపూర్  – పెబ్బేరు రహదారికి రూ.60 లక్షలు,
ఘణపురం మండలం అప్పారెడ్డిపల్లి రహదారికి రూ.50 లక్షలు,సోళీపూర్  – కోతులకుంట తండా రహదారికి రూ.50 లక్షలు,కొత్తపల్లి రహదారికి రూ.45 లక్షలు,
వనపర్తి పెబ్బేరు రహదారి నుండి పై గడ్డ నుండి పెద్దగూడెం తండా మీదుగా రహదారికి రూ.1.30 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని అన్నారు.మొత్తం నియోజకవర్గంలోని వివిధ రకాల పనుల కోసం రూ.147.30 కోట్లు మంజూరు అయ్యాయని అన్నారు.
నియోజకవర్గంలో అవసరమైన ప్రతి పని పూర్తి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు.వనపర్తి అభివృద్దికి నిరంతరం అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News