Saturday, November 16, 2024
HomeతెలంగాణSingireddy Niranjan Reddy: సమాచార పంపిణీలో సోషల్ మీడియా విప్లవం

Singireddy Niranjan Reddy: సమాచార పంపిణీలో సోషల్ మీడియా విప్లవం

సోషల్ మీడియా ద్వారా ప్రచారం ఉధృతం చేయాలన్న మంత్రి

సమాచార పంపిణీలో సోషల్ మీడియా విప్లవం తీసుకువచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.వనపర్తి తెలంగాణ భవన్ (బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం)లో నియోజకవర్గ అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అన్ని స్థాయిల పార్టీ బాధ్యులకు నిర్వహించిన సోషల్ మీడియా శిక్షణా శిబిరంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.ఉత్తరాలు, ల్యాండ్ లైన్ ఫోన్లకు కూడా కాలంచెల్లిందనీ,విషయాల చేరివేతలో ఆధునికత చోటు చేసుకున్నదని అన్నారు.
పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎన్నికల ప్రచారంలో ఒకప్పుడు గోడరాతలు, బట్ట బ్యానర్లు, ఒక చిన్న జీపులదే గొప్ప ప్రచారం అని,ఇప్పుడు మారిన ఆధునిక యుగంలో సంపూర్ణంగా పరిస్థితి మారిపోయిందనీ అన్నారు.దానిని నేర్చుకుని ఆచరించేందుకు మనం సిద్దంగా ఉండాలని,జీవితం నేర్పిన పాఠాల నుండి ప్రజలు ఎంతో నేర్చుకుంటూ అన్ని విషయాలను నేర్చుకోవడం, తెలుసుకోవడం జరుగుతున్నదనీ,ప్రజలకు ఏమీ తెలియదు అనుకుంటే మనకన్నా అమాయకులు ఎవరూ ఉండాలని గుర్తు చేశారు.ఒకప్పటి దూరదర్శన్ స్థానంలో అనేక వందల న్యూస్ ఛానళ్లు వచ్చాయనీ,ఒకప్పటి రెండు, మూడు పత్రికల స్థానంలో వందల, వేల పత్రికలు వచ్చాయనీ,ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో సమూల మార్పులు వచ్చాయనీ అన్నారు.మారిన వార్తా ప్రపంచంలో సోషల్ మీడియాదే అగ్రస్థానం .. ఈ పేపర్ లకు ఆదరణ పెరుగుతున్నదనీ, చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకుందాం .. ప్రజలు ఆశీస్సులు అందిస్తారనీ గుర్తు చేశారు.ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని,రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా మత్స్య కళాశాలను పెబ్బేరులో ఏర్పాటు చేశామన్నారు.

- Advertisement -


పెబ్బేరు రహదారిలో ముందుచూపుతో వే సైడ్ మార్కెట్ ఏర్పాటు చేశామన్నారు.రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా 64 మినీ లిఫ్ట్ లు ఏర్పాటు చేశామని, వనపర్తికి జేఎన్టీయూ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల సాధించమని,దేశంలో తొలి వ్యవసాయ డిగ్రీ కళాశాల వనపర్తిలో నెలకొల్పడం జరిగిందన్నారు.ఎక్కడా లేనివిధంగా స్వంత డబ్బులతో క్షయ వ్యాధిగ్రస్తులకు బలవర్దక ఆహారం అందిస్తున్నాం .. కేంద్ర మంత్రి మాన్ సుక్ మాండవీయ ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో అభినందించారు .. దీనికి కారణం సోషల్ మీడియా అని గుర్తు చేశారు.రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి మండలంలో అన్ని వర్గాల ప్రజల కోసం సర్వవర్గ సామూహిక భవనాలు నిర్మిస్తున్నామనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మొదట 5 చెక్ డ్యాంలు తెచ్చి 55 రోజులలో నిర్మించమనీ, అంత తొందరగ కట్టింది అధికారులతో తెలుసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ మరో 11 చెక్ డ్యాంలు మంజూరు చేశారని గుర్తు చేశారు. మంత్రిగా ఉండి రాష్ట్రంలో అత్యధిక పల్లెనిద్రలు చేశామని, తెలంగాణ ఉద్యమంలో, బీఅర్ఎస్ పార్టీలో దివంగత గాయకుడు, కవి సాయిచంద్ సేవలు గొప్పవని కొనియాడారు.తెలంగాణ ప్రకటన వచ్చిన వెంటనే వనపర్తిలో కళాకారులకు ‘పాటకు సత్కారం’ పేరుతో 200 మందిని సన్మానించుకున్నమనీ, తెలంగాణ ఏర్పడక ముందే ఈ ప్రాంతంలో అమరుల కుటుంబాలను సత్కరించుకుని స్మరించుకున్నమనీ గుర్తు చేశారు.2014 ఎన్నికలలో ఓడిపోయినా వనపర్తి అభివృద్ధి కోసం కృషి చేశానని,2018 ఎన్నికలలో నా పనిని గమనించి ప్రజలు జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా శిక్షణా తరగతుల చైర్మన్ పురుషోత్తం రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త వంగూరు ప్రమోద్ రెడ్డి , సోషల్ మీడియా శిక్షకులు సత్యప్రసాద్ పెద్దపల్లి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News