టిఆర్ఎస్ పార్టీ మూడవసారి అధికారం రావడం పక్కా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖిల్లాఘణపురం మండలకేంద్రంలోని బాదం సరోజిని దేవి ఫంక్షన్ హాల్ లో మండలంలోని 27 గ్రామాల ప్రజలతో వేర్వేరుగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడవసారి అధికారం మనదేనని, కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోష్యం చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ శక్తులూ అడ్డుకోలేవనీ,కరోనా విపత్తులో కూడా రైతాంగానికి ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి రైతుబంధుతో ఆదుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
తెలంగాణలో పడావుపడ్డ చెరువులను పునరుద్దరించి కృష్ణా, గోదావరి నీళ్లతో నింపి చెరువులకు పూర్వవైభవం తీసుకువచ్చామనీ,సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నమనీ అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగా తెలంగాణ పల్లెలు పచ్చబడ్డాయనీ,
రైతులు, రైతు కూలీలు వ్యవసాయ చేసుకుంటూ హాయిగా, గౌరవంగా జీవనం గడుపుతున్నారనీ గుర్తు చేశారు. తెలంగాణలోని ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ది పొందుతున్నదనీ,
గ్రామాలలో ఇండ్లు లేని నిజమైన లబ్దిదారులను గుర్తించి దశలవారీగా గృహలక్ష్మి పథకం అమలుచేస్తా మనీ అన్నారు. 3.30 కోట్లతో నిజలాపూర్ నుండి మహ్మద్ హుస్సెన్ పూర్ వరకు రహదారి మంజూరయింది, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామనీ,
గతంలో నియోజకవర్గానికి 100 మందికి దళితబంధు అమలుచేశామన్నారు. ఈ విడతలో నియోజకవర్గానికి 1000 మందికి దళితబంధు అమలుచేస్తామనీ అన్నారు.
ప్రభుత్వ చేయూతతో ప్రతి ఒక్కరూ వారి కాళ్ల మీద వాళ్లు నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.దేశంలోని మరే రాష్ట్రంలోనూ తెలంగాణ మాదిరిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు.విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, ఐటీ, పారిశ్రామిక రంగాలలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందనీ గుర్తు చేశారు.
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా ఫించన్లు, రైతుబంధు, దళితబంధు, రైతుభీమా, కేసీఆర్ కిట్, పోషకాహార కిట్లు వంటి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. దశలవారీగా అందరికీ అన్ని పథకాలు వందశాతం అమలుచేస్తామనీ హామీ ఇచ్చారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించి అండగా నిలవాలని అన్నారు.