రాజన్న సిరిసిల్ల(Sircilla) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి మరణించడం తీవ్ర విషాదం నింపింది. సిరిసిల్లలోని ఓ బిల్డింగ్‌లో లిఫ్ట్ వచ్చిందనుకుని లోపలికి అడుగుపెట్టడంతో పోలీస్ అధికారి గంగారామ్(55) కిందపడ్డారు. మూడో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌లోని లిఫ్ట్‌పై ఆయన పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే గంగారాం మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -
కాగా గంగారామ్ తెలంగాణ స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన తెలంగాణ సచివాలయానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. గంగారాం స్వస్థలం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం.