Wednesday, October 30, 2024
HomeతెలంగాణSirisilla: అక్రమంగా బీఆర్ఎస్ నాయకుడు భూ రిజిస్ట్రేషన్

Sirisilla: అక్రమంగా బీఆర్ఎస్ నాయకుడు భూ రిజిస్ట్రేషన్

ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితురాలు

బీఆర్ఎస్ నాయకుడు కోడి అంతయ్య తమ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని బాధితురాలు గంగ శోభ ప్రజావాణిలో కలెక్టర్ కు పిర్యధు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన శోభ గారి మామ అయిన గంగ చిన్ననారాయణ తేదీ. 14-10-1997 రోజున తంగళ్లపల్లి గ్రామానికి చెందిన గొట్టె ఎల్లయ్య తండ్రి కోటయ్య వద్ద నుండి తాడూరు శివారులో గల సర్వే. నెం.1156లో 25 గుంటలు కొన్నాడని, అట్టి భూమిని అప్పటి నుండి ఇప్పటి వరకు మేమే సాగు చేస్తున్నామని తెలిపింది. కానీ ఆ భూమిని బిఆర్ఎస్ నాయకుడు, మాజీ జెడ్పీటిసి, ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీ ఎంపిటిసి కోడి అంతయ్య అనే ప్రజాప్రతినిధి వారి భూమిని అక్రమంగా తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రభుత్వం నుండి వచ్చేటువంటి రైతుబంధు, డబ్బులు అతనే కాజేస్తున్నాడని వాపోయారు. ఆ భూమి నాదే అని శోభ కోడి అంతయ్యను ప్రశ్నించగా వారి కుటుంబాన్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశార. ఇది వరకు అధికారులు సైతం విచారణ జరిపి ఈ భూమి శోభ వారిదే అని కూడా నిర్ధారించారని, కానీ కోడి అంతయ్య అనే బిఆర్ఎస్ నాయకుడు వినకుండా ఈ భూమి నాకే వస్తుంది అని దౌర్జన్యం చేస్తున్నాడని తెలిపారు. కోడి అంతయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి యొక్క భూమిని, రైతుబందు డబ్బులను వారికి ఇప్పించి తగిన న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News