Friday, November 22, 2024
HomeతెలంగాణSirisilla: కేకేను కలిసి మొరపెట్టుకున్న మండెపల్లి భూ నిర్వాసితులు

Sirisilla: కేకేను కలిసి మొరపెట్టుకున్న మండెపల్లి భూ నిర్వాసితులు

బాధితులకు కేకే మహేందర్ రెడ్డి భరోసా

సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రాష్ట్ర నేత కేకే మహేందర్ రెడ్డిని మండెపల్లి భూ నిర్వాసితులు కలిసి మొరపెట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామంలో కేకేను కలిసి వారి బాధను వెల్లడించారు. మండెపల్లి శివారులో గల సర్వే నెం. 377లో దాదాపు 360 ఎకరాల భూమిని కోల్పోయామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత కేకే మహేందర్ రెడ్డిని కలిసి భూ నిర్వాసితులు మొరపెట్టుకున్నారు. మండెపల్లి గ్రామస్థులకు కాకుండా సిరిసిల్లకు చెందిన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణానికి ఇక్కడి స్థలాలను కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు తమ గళం వినిపించినా పట్టించుకున్న పాపాన పోలేదని కేకే ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండెపల్లి భూ నిర్వాసితులకు అండగా ఉండి అడుకుంటామని వారికి భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ స్థలాలు వచ్చాయని, రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లను అక్కడ నిర్మించుకుంటామని కేకేకు భూ నిర్వాసితులు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ లింగాల భూపతి, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మునిగేల రాజు, మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుగ్గిళ్ళ భరత్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మండపల్లి భూ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News