రైల్వే లైన్ కోసం నిర్ధిష్టమైన ప్రతిపాదనలు పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం అర్దరహితమైన కారణాలు చూపుతూ పక్కన పెట్టిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో ఉన్న బీజేపీ సన్నాసులను పట్టించుకోవడం వ్యర్థం.. వీళ్లకు నోరు లేదు,తెలివి లేదు, అడిగే దమ్ము లేదు అంటూ.. బీజేపీ వాళ్లను కేంద్ర ప్రభుత్వం గంజిలో ఈగను తీసేసినట్టు తీసేసిందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ ఎనిమిదేళ్లు రాష్ట్రానికి చేసిన అన్యాయాలను సవరిస్తూ.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తో పాటు రైల్వే ప్రాజెక్టులకు ఈ బడ్జెట్ లో మొత్తం నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. కొత్తగా జిల్లాలు ఏర్పడితే కొత్తగా జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టంలోనే ఉన్నా కానీ ఒక్క విద్యాసంస్థను కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు.