శ్రీశైలం లెప్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటికి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిరంతరం సమీక్షిస్తున్నారు.






