Sunday, February 23, 2025
HomeతెలంగాణSLBC rescue ops: అడ్డంగా మారిన మట్టి, బురద నీళ్లు

SLBC rescue ops: అడ్డంగా మారిన మట్టి, బురద నీళ్లు

సహాయక చర్యలు

శ్రీశైలం ఎడమగట్టు ఎస్ ఎల్ బి సి టన్నెల్లో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని రక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. వారిని రక్షించే విధంగా ఉన్నతాధికారుల ఆలోచనలు టెక్నికల్ సలహాలు సూచనలతో రెస్క్యూ టీం ఆపరేషన్ పనులు వేగవంతంగా ప్రయత్నాలు చేస్తున్నాయని ఇక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

- Advertisement -

200 మీటర్ల వరకు మట్టి

ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు నేవీ ఉన్నత అధికారులతోనూ సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు 13వ కిలోమీటర్ల తర్వాత నీరు మట్టి సుమారు 12 మీటర్ల వ్యాసర్తంలో పేరుకుపోయి ఉన్నట్లుగా అంచనాకు వచ్చామని వివరించారు. 13వ కిలోమీటర్ అనంతరం సుమారు 200 మీటర్ల పొడవు మట్టి చేరి ఉంటుందన్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు అన్ని అవకాశాలు ఉపయోగిస్తూ రెస్క్యూటీం ఆపరేషన్ కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు. అంతకుముందు సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో కలిసి ఉత్తంకుమార్ రెడ్డి రెస్క్యూ ఆపరేషన్ పై చర్చించారు.

11 km లోకో ట్రైన్ లో
రాత్రి లోపలికి వెళ్లిన వచ్చిన సిబ్బంది అక్కడి పరిస్థితిని ఉన్నత అధికారులకు వివరించారు అనంతరం వారు చేపట్టిన చర్యలు అందుకు కావలసిన సామాగ్రితో ఇవాళ మరోసారి రెస్క్యూ టీం సిబ్బంది లోపలికి వెళ్లారు 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ లో వెళ్లిన ఎండిఆర్ బృందాలు అక్కడి నుంచి మూడు అడుగుల మేర నీరు నిలిచి ఉండడంతో ఆపై నడుస్తూ వెళ్లాయి టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు చేరుకొని బోరింగ్ మిషన్ కొంత దెబ్బతిన్నదని రెండు వైపులా పూర్తిగా మట్టి బురద నిండిపోయినట్లు గుర్తించాయి అతి కష్టం మీద టీపీఎ ముందు వైపునకు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు చేరుకున్నాయి నీరు మట్టి బురద తోడే వరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి ఉండడంతో మట్టిదిబ్బలను తొలగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు.

రంగంలోకి ప్రత్యేక టీమ్స్

సహాయక చర్యల్లో 130 మంది ఎన్ డి ఆర్ ఎఫ్ , 24 మంది హైడ్రా సిబ్బంది, 24 మందితో కూడిన ఆర్మీ బృందం, 24 మందితో కూడిన సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీం, 120 మంది ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది పాల్గొంటున్నారు. సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలగా సహాయక బృందాలు 13.5 కిలోమీటర్ల వరకు వెళ్లాయి. మరో అర కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి నీరు బురద అడ్డుపడుతుండగా, వాటిని దాటుకొని ఘటన స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్ల వెనుకకు వచ్చిందని ఏజెన్సీ వెల్లడించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News