బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao)కు తెలంగాణ హైకోర్టు(TG High Court)లో స్వల్ప ఊరట దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసును క్వాష్ చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం హరీశ్ రావును అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఆ ఉత్తర్వులను పొడిగిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 12వ తేదికి వాయిదా వేసింది.