కరీంనగర్‌లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను గడువులోగా పూర్తి చేయాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులకు సూచించారు. సోమవారం స్మార్ట్ సిటీ ఫేజ్ -2 పనులలో భాగంగా ఓల్డ్ పవర్ హౌజ్ నుండి నాకా చౌరస్తా వరకు నిర్మితమవుతున్న పనులను బొమ్మకల్ చౌరస్తాలో మంత్రి గంగుల పరిశీలించారు. పనుల పురోగతిని కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న తీరుపట్ల మంత్రి గంగుల సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. మంగళివాడ చౌరస్తా నుండి వరహాస్వామి టెంపుల్, నిత్యం రద్దీగా ఉండే టవర్ సర్కిల్ ప్రాంతం, రాజు టీస్థాల్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ నాంపల్లి శ్రీనివాస్ సుడా డైరెక్టర్ నేతి రవి వర్మ, ఆంజనేయులు స్మార్ట్ సిటీఇంజనీర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.