తెలంగాణలో 10వ తరగతి(Tenth Students) పరీక్షలకు సిద్దమవుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పబ్లిక్ పరీక్షలు జరగనుండగా… ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్స్‌లో స్నాక్స్(Snacks) ఇవ్వనున్నారు.
తాజాగా ఇందుకు సంబంధించిన మోనూను అధికారులు రెడీ చేశారు. తృణధాన్యాలతో చేసిన బిస్కెట్లు, పల్లి చిక్కీ, ఉడకబెట్టిన బొబ్బర్లు (పెద్ద శనగలు), ఉల్లిపాయ పకోడీలు, ఉడకబెట్టిన పెసర్లు, శనగలు-ఉల్లిపాయ వంటి వంటకాలను రోజుకొకటి చొప్పున విద్యార్థులకు అందించాలని నిర్ణయించారు. ఈ స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనుండగా.. స్కూల్ యాజామాన్యం కమిటీ ఖాతాలకు ఈ నిధులు బదిలీ చేయనున్నారు.