Saturday, November 15, 2025
HomeTop StoriesSnake Attack: పగబట్టిన పాము.. ఒకే నెలలో ఏడు సార్లు.. ఆది, బుధ, శనివారాల్లోనే కాటేస్తున్న...

Snake Attack: పగబట్టిన పాము.. ఒకే నెలలో ఏడు సార్లు.. ఆది, బుధ, శనివారాల్లోనే కాటేస్తున్న సర్పం!

Snake bites: పాము పగ పడుతుందా.. వెంటాడి, వేటాడి కాటేస్తుందా.. ఇదంతా వట్టి బుర్రకథేనని కొట్టి పారేస్తారు. కానీ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో ఓ వ్యక్తిని పాము పగబట్టినట్లుగా.. ఒకే నెలలో ఏడు సార్లు కాటేసింది. సకాలంలో కుటుంబ సభ్యులు స్పందించి ఆసుపత్రికి తరలిస్తుండటంతో అతడు ప్రాణాలతో బయటపడుతున్నాడు. అయితే ఆ పాము కేవలం ఆది, బుధ, శనివారాల్లోనే కాటేస్తుందని.. బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు.

- Advertisement -

33 రోజుల్లో ఏడుసార్లు కాటు: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో శ్రీకాంత్‌ అనే వ్యక్తి గత కొన్నిరోజులుగా పాముకాటుకు గురవుతున్నాడు. బొంకూర్‌ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దసరా నవరాత్రులకు ముందు అతడు అనుకోకుండా ఓ పాము పడగను తొక్కాడు. దీంతో కోపగించుకున్న పాము అతడిని కాటు వేయబోయింది. కానీ అప్రమత్తమైన శ్రీకాంత్‌ దాని కాటు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అయితే ఆ పాము పగ పట్టినట్టుగా.. శ్రీకాంత్‌ ఇంటి చుట్టే ఆ పాము తిరిగేది. నాలుగైదు రోజుల తర్వాత రాత్రి సమయంలో బాత్రూంకు వెళ్తున్న శ్రీకాంత్‌ను పాము కాటువేసింది. వెంటనే అప్రమత్తమైన శ్రీకాంత్‌ తన సోదరులకు ఫోన్‌ చేసి చెప్పడంతో.. అతడు ఆస్పత్రికి తరలించాడు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న అతడిని మరో ఐదు రోజులకు మధ్యాహ్నం మరోసారి పాముకాటు వేసింది. మళ్లీ వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో అతడు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులు గమనించిన విషయం ఏంటంటే.. ఆ పాము కేవలం బుధవారం, శనివారం, ఆదివారం రోజుల్లోనే శ్రీకాంత్‌ కాటువేస్తుంది. ఇలా 33 రోజుల్లోనే ఏడుసార్లు పాముకాటుకు గురై చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటున్నాడు.

Also Read: https://teluguprabha.net/telangana-news/chevella-bus-incident-updates/

వినడానికి వింతగా అనిపించినా ఆయనను వదలకుండా పాము వెంటాడుతూ కాటేస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాంత్‌కు ఏదైనా సర్పదోషం ఉందేమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆది, బుధ, శనివారం వచ్చిందంటే చాలు తనకేదో కీడు జరుగుతుందనే ఉద్దేశంతో ఫోన్లను ఎప్పుడూ అంటిపెట్టుకుంటున్నట్టుగా అతడు పేర్కొన్నాడు. అయితే శ్రీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని ఒకే నెలలో ఏడు సార్లు.. ఎందుకు కాటు వేస్తుందో తెలియక కుటుంబ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad