ఈ నెల 27న మహారాష్ట్ర, సోలాపూర్ జిల్లా పండరీ పూర్ లో బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో భాగంగా సభ ఏర్పాట్లను, సభ ఆవరణలోనీ హెలీప్యాడ్ ఏర్పాట్లను దగ్గర ఉండి ప్రత్యక్షంగా పరిశీలించారు ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే, బిఆరెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు డా.బాల్క సుమన్. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేణుగోపాలచారి, బీఅర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షులు మాణిక్ కదం, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.