South India Shopping Mall Festival Offers: దసరా, దీపావళి పండుగ సీజన్ సమీపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. కొత్త బట్టలు, పిండి వంటలతో ప్రతి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే కస్టమర్లను ఆకర్షించేందుకు షాపింగ్ మాల్స్ అనేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. తాజాగా, తెలుగు ప్రజలకు సుపరిచితమైన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. సూపర్ ధమాకా ఆఫర్స్, స్పాట్ గిఫ్ట్స్‌లో భాగంగా ప్రతి కొనుగోలుపై రూ. 2 వేల విలువ చేసే బహుమతులు అందజేస్తామని తెలిపింది. అదే విధంగా రూ. 4335 విలువ గల కామాక్షి పట్టు చీర కొనుగోలు చేసే కస్టమర్లకు ఆఫర్‌లో భాగంగా కేవలం రూ. 45లకే మరో చీరను అందించనుంది. మరోవైపు, రూ. 4995 విలువ గల పట్టుచీర కొనుగోలు చేసే కస్టమర్లకు మిక్సీ గ్రైండర్‌ను ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. వీటితో పాటు మెన్స్‌వేర్, కిడ్స్‌వేర్, పాపులర్ బ్రాండ్లపై 1+1, స్పెషల్ కాంబో ఆఫర్లను కూడా అందిస్తున్న తెలిపింది. ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు కస్టమర్లకు విజ్ఞప్తి చేశారు.


