Thursday, July 4, 2024
HomeతెలంగాణPocharam: చిన్నారి పాటకు స్పీకర్ ఫిదా

Pocharam: చిన్నారి పాటకు స్పీకర్ ఫిదా

చిన్నారికి అభినందనల వెల్లువ

పోతంగల్ మండలంలోని కొడిచర్ల గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలలో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని యూపీఎస్ స్కూల్లో 18 లక్షలతో ‘మన ఊరు మనబడి’ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన అడిషనల్ క్లాస్ రూమ్ లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించిన అనంతరం స్కూల్ విద్యార్థిని శివాని పాడిన పాటకు స్పీకర్ ఫిదా అయ్యారు. స్కూల్లో విద్యార్థి పాడిన పాటను విన్న స్పీకర్ ఆ స్టూడెంట్ తో అనంతరం ఏర్పాటు చేసిన సభలో కూడా ఆ పాట పాడించారు. తల్లి బిడ్డల మధ్య ఉన్న ప్రేమానురాగాలు తెలిపే పాట కావడంతో అందరూ ఆ విద్యార్థిని మెచ్చుకున్నారు. కోటగిరి ఏఎంసీ చైర్మన్ హమీద్ పాట పాడిన విద్యార్థినికి 500 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. చిన్నారి పాడిన పాటకు ఫిదా అయినా స్పీకర్ స్పీకర్ స్టూడెంట్ శివానిపై ప్రశంసలు కురిపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News