Committee on Fee Reimbursement in Telangana: విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై సమగ్ర అధ్యయనం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 3 నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
గతకొంత కాలంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన గత నెల 28నే ప్రభుత్వం జీఓ విడుదల చేయగా.. దానిని ఈ రోజు బయట పెట్టింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/warangal-floods-second-capital-infrastructure-failure/
ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై సమగ్రం అధఅయయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీకి సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ప్రొఫెసర్ కోదండరాం, కంచ ఐలయ్య, ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌తో పాటు ఉన్నత విద్యాసంస్థల నుంచి ముగ్గురు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై ఈ కమిటీ సమీక్ష చేసి, ప్రభుత్వానికి తగిన సూచనలు అందించనుంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/janasena-supports-to-bjp-in-jubilee-hills-by-elections/
అదేవిధంగా, ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేసే అవకాశాలను కూడా ఈ కమిటీ పరిశీలించనుంది. మూడు నెలల వ్యవధిలో నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అదనంగా, విద్యా సంస్థలు అందించిన సూచనలను కూడా కమిటీ పరిశీలించి తన నివేదికలో భాగం చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది.


