Special Dinner Son In Law: తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ అంటే ఎంత ప్రత్యేకమో మనందరికీ తెలుసు. ఇక ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్లకు ఇచ్చే మర్యాదల్లో కూసింత ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. సాధారణంగా సంక్రాంతి పండుగ వస్తే ఆంధ్రాలో కొత్త అల్లుడికి ఇచ్చే మర్యాదలు ఎప్పటికీ తరిగిపోని ముచ్చటే. ఇక ఇప్పుడు దసరా పండుగకి తెలంగాణలో కొత్త అల్లుడికి ఇచ్చిన విందు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆ విశేషాలేంటో చూద్దాం..
వనపర్తి జిల్లా కొత్తకోట పురపాలికలో దసరా పండుగకి కొత్త అల్లుడికి ఇచ్చిన మర్యాదల గురించి ఇప్పుడు చుట్టుపక్కలే కాదు సోషల్ మీడియాలో కూడా ఫేమస్ అయింది. గుంత నరేశ్, సహన దంపతుల కుమార్తెను వరంగల్‌కు చెందిన నిఖిల్‌తో జరిపించారు. ఈ క్రమంలో దసరా పండుగకి ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి గుంత నరేశ్ దంపతులు 101 రకాల వంటకాలతో ఆంధ్రా తరహాలో పసందైన విందు ఇచ్చారు.
Also Read: https://teluguprabha.net/viral/viral-video-elephant-injured-after-being-hit-by-train/
ఏపీలో లాగానే తెలంగాణలో కూడా ఇచ్చారు.. ఇక్కడేముంది స్పెషల్ అనుకుంటున్నారా.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. విస్తరిలో కరెక్టుగా 101 రకాల వంటకాలు ఉన్నాయా అని అల్లుడు అడిగాడు. ఉన్నాయని చెప్పారు అత్తామామలు. తక్కువైతే ఏమిస్తారని చమత్కరించాడు అల్లుడు.. తులం బంగారం పెడతామని హామీ ఇచ్చారు అత్తామామలు.
Also Read: https://teluguprabha.net/viral/viral-video-elephant-injured-after-being-hit-by-train/
అంతే విస్తరిలో వంటకాలు లెక్కపెట్టడం మొదలు పెట్టాడు. అల్లుడి అదృష్టం… విస్తరిలో ఒక వంటకం తక్కువైంది. హామీ ఇచ్చినట్లుగానే తులం బంగారం పెట్టడానికి ఒప్పుకున్నారు అత్తామామలు. మొత్తానికి ఇంటికి వచ్చిన కొత్త అల్లుడు.. 100 రకాల పసందైన వంటకాలతో పాటు రూ. లక్షకు పైగా విలువైన తులం బంగారాన్ని దక్కించుకున్నాడు. 60 రకాల స్వీట్లు, 30 రకాల పిండివంటలు, అన్నంతో పాటు 10 రకాల రుచులను విస్తరిలో వడ్డించి పసందైన విందు ఏర్పాటు చేశారు.


