Tuesday, June 24, 2025
HomeతెలంగాణRevanth Reddy: సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో సీఎం ప్రత్యేక పూజలు

Revanth Reddy: సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో సీఎం ప్రత్యేక పూజలు

నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబసమేతంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సీఎం దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం, రైతులు సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహా, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, నాగర్ కర్నూలు జిల్లా ఎంపీ మల్లు రవి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News