అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను(Telangana Budget) కాసేపట్లో ఆర్ధిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు ఆయన ప్రజాభవన్ ఆవరణలోని నల్ల పోచమ్మ ఆలయంలో అమ్మవారి ముందు బడ్జెట్ ప్రతులను పెట్టి సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భట్టి దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.
- Advertisement -
అక్కడి నుంచి భట్టి విక్రమార్క నేరుగా అసెంబ్లీకి బయలుదేరారు. బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ఉదయం 11.02 నిమిషాలకు బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.