నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)శ్రీ నీలకంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. పూజారులు నీలకంఠేశ్వరుడి గర్భగుడిలో ఆమె పేరున ప్రత్యేక అర్చనలు చేశారు. ఆలయంలోని అన్ని దేవుళ్లను ఆమె దర్శించుకుని ప్రదక్షిణలు చేశారు. పూజల అనంతరం కవితకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గడ్డం సుమన, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కడారి శ్రీవాణిలు ఉన్నారు.
MLC Kavitha: శ్రీ నీలకంఠేశ్వరాలయంలో కవిత ప్రత్యేక పూజలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES