IIT JEE Advanced 2024 ఓపెన్ క్యాటగిరీలో టాప్ 10 లోపు, టాప్ 100 లోపు అత్యధిక ఆలిండియా ర్యాంకులు శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులు సాధించటం విశేషం. JEE Advanced 2024లో తెలుగు రాష్ట్రాల కీర్తిని దశదిశలా వ్యాపింప జేసిన శ్రీచైతన్య విద్యార్థులవైపే ఇప్పుడు యావత్ దేశం కళ్లు ఉండటం శ్రీచైతన్య విద్యా సంస్థలకు, చైతన్య సంస్థల్లో విద్యనభ్యసిస్థున్న విద్యార్థులకు గర్వమైన క్షణాలుగా నిలిచాయి.
నేడు విడుదలైన IIT-JEE ADVANCED 2024 ఫలితాల్లో ఆలిండియా 1st ర్యాంక్ తో పాటు ఓపెన్ కేటగిరిలో ఆలిండియా 4, 5, 6, 9, 10, 12, 14 ర్యాంకులతో శ్రీచైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. టాప్ ర్యాంకుల్లోనూ, టోటల్ ర్యాంకుల్లోనూ తిరుగులేని అగ్రస్థానంతో దూసుకెళ్ళింది. ఆలిండియా 1వ ర్యాంక్ రాఘవశర్మ (H.T.No: 242053073) ఆలిండియ ఓపెన్ కేటగిరిలో 4వ ర్యాంక్ రిథమ్ కేడియా (Η.Τ.Νο: 247025176), 55 ໐ (H.T.No. 246150349), 5 2 65 0 (HT No 241016176), ధృవిన్ హేమంత్ దోషి 9వ ర్యాంక్ (HT. No: 241106162), అల్లడబోయిన ఎస్ఎస్ఈబీ సిద్ధ్విక్ సుహాన్ 10వ ర్యాంక్ (H.T.No: 246119101) సాధించారు. ఓపెన్ క్యాటగిరీలో టాప్ 10లోపు 5 ర్యాంకులతో పాటు, 100 లోపు 30 ర్యాంకులు, 1000 లోపు 202 ర్యాంకులు, వివిధ క్యాటగిరీల్లో 100 లోపు 146, 1000 లోపు 721 ర్యాంకులు, మొత్తం అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య 3,728 శ్రీచైతన్య విద్యార్థులే.
ఈసారి ఐఐటీల్లో మొదటి వరుసతో పాటు మొత్తం సీట్లలోనూ అత్యధిక శాతం శ్రీచైతన్యదేనని నిరూపించారు. ఈ సందర్భంగా శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్క మాట్లాడుతూ… దేశంలో నిష్ణాతులైన టాప్ ఫ్యాకల్టీతో ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో నాణ్యమైన శిక్షణను అందిస్తూ… అనితర సాధ్యమైన ప్రోగ్రాములు, మైక్రో షెడ్యూల్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ర్యాంకింగ్ సిస్టమ్స్ ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. అందువల్లే IIT ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు శ్రీచైతన్యనే కోరుకుంటున్నారని వివరించారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఆధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని శ్రీమతి సుష్మ అభినందించారు.
శ్రీచైతన్య గ్రూప్ గురించి
1986లో ప్రారంభమైన శ్రీచైతన్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, గుజరాత్, ఛత్తీస్గర్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒరిస్సా మరియు అస్సాం అంతటా విస్తరించి 900 శాఖలతో, 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు సేవలు అందిస్తోంది మరియు JEE మరియు NEET మరియు టాప్ నుండి 100 పర్సంటైల్ ర్యాంక్ హెూల్డర్లను మరియు ఆలిండియా టాప్ ర్యాంకర్లను అభినందిస్తోంది.