Friday, November 22, 2024
HomeతెలంగాణSrinivas Goud: క్రీడా హబ్ గా మహబూబ్ నగర్

Srinivas Goud: క్రీడా హబ్ గా మహబూబ్ నగర్

హైదరాబాద్ కంటే మహబూబ్ నగర్ ప్రశాంతంగా ఉందనేలా చేస్తా

మహబూబ్ నగర్ ను క్రీడా హబ్ గా మారుస్తామని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. స్థానిక స్టేడియం గ్రౌండ్ లో అంతర్జాతీయ స్థాయిలో ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశామని… త్వరలోనే ఇక్కడ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తామని అన్నారు. హైదరాబాద్ కు ప్రత్యామ్నాయంగా కూడా మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్స్ లో శ్రీనివాస్ గౌడ్ మార్నింగ్ వాక్ చేశారు. మార్నింగ్ వాకర్స్ తో మాట్లాడారు. చేసిన అభివృద్ధిని… భవిష్యత్ విజన్ ను వారికి వివరించారు.ఫుట్ బాల్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశామని..షటిల్, బాస్కెట్ బాల్, బాక్సింగ్ వంటి ఇండోర్ క్రీడల అభివృద్ధి కోసం అంతర్జాతీయ స్థాయిలోఇండోర్ స్టేడియంలు నిర్మించామన్నారు.
కెసిఆర్ అర్బన్ ఎకో పార్కులో యోగా షెడ్డు వల్ల ప్రకృతిలో ప్రశాంతంగా యోగా చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 26 వేల ఎకరాల్లో అతి పెద్ద అర్బన్ జంగిల్ సఫారీ మనం ఏర్పాటు చేసుకున్నాం, ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం అన్నారు. నెక్లెస్ రోడ్ పై 3.5 కిలోమీటర్ల మేర నిర్మించిన వాకింగ్ ట్రాక్ వద్దకు స్టేడియం నుంచి చేరుకునేందుకు ర్యాంప్ ఏర్పాటు చేసి వాకింగ్ చేసే వారికి అందుబాటులోకి తెస్తున్నాం అన్నారు. ఉదండాపూర్ నుంచి కృష్ణా జలాలను తీసుకువచ్చి ట్యాంక్ బండ్ ను నింపుతాం అన్నారు.ఐటీ మరియు ఎనర్జీ పార్క్ ద్వారా 50 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, హైదరాబాద్ కంటే మహబూబ్ నగర్ లో ఉంటేనే ప్రశాంతంగా ఉండేలా చేస్తాం అన్నారు.
శిల్పారామంలో వాటర్ రైడింగ్, వేవ్ పూల్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ ను అందుబాటులోకి తెస్తామని, హైదరాబాద్ బదులుగా మహబూబ్ నగర్ లోనే నివసించేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. పదేళ్లుగా ఎవరు అభివృద్ధి చేస్తున్నారనేది తెలుసుకోండి అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, స్థానిక కౌన్సిలర్ రామ్ లక్ష్మణ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News