జిల్లా ప్రజల అభీష్టం మేరకే నూతన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని నిర్మిస్తామని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వీరన్నపేట ప్రాంతంలో నూతన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించాలని ప్రతిపాదించామని, అయితే జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్తో పాటు, కొంత మంది ప్రజలు సైతం నూతన ఎస్పీ కార్యాలయాన్ని వీరన్న పేటకు బదులుగా జడ్చర్ల లేదా భూత్పూర్ రహదారిపై అనుకూలమైన ప్రదేశంలో నిర్మించాలని చేసిన విజ్ఞప్తి మేరకు స్థలాన్ని పరిశీలించిన మీదట తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ను కలిసి ఒక వినతి పత్రాన్ని అందజేశారు.నూతన ఎస్ పి కార్యాలయాన్ని ప్రతిపాదిత వీరన్నపేట ప్రాంతంలో కాకుండా ప్రస్తుతం ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్ లేదా, భూత్పూర్, జడ్చర్ల రహదారులపై ఎక్కడో ఒక చోట నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రిని కలిసిన వారిలో జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటయ్య, ఉపాధ్యక్షులు సురేష్ జనరల్ సెక్రటరీ హనుమప్ప, జాయింట్ సెక్రెటరీ పద్మలత , రాములు తదితరులు ఉన్నారు.
Srinivas Goud: ప్రజల అభీష్టం మేరకే ఎస్పీ కార్యాలయ నిర్మాణం
వీరన్నపేట, జడ్చర్ల, భూత్పూర్ లలో ఎక్కడ ఎస్పీ ఆఫీస్ నిర్మిస్తారో