Sunday, July 7, 2024
HomeతెలంగాణSrinivas Goud: పర్మినెంట్ డిజేబుల్ సర్టిఫికెట్ అందిస్తాం

Srinivas Goud: పర్మినెంట్ డిజేబుల్ సర్టిఫికెట్ అందిస్తాం

దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి

దేశంలో దివ్యాంగులకు 4,016 పింఛన్ అందిస్తున్నది కేవలం తెలంగాణలో మాత్రమేనని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించి, వారికి అండగా నిలుస్తున్నదని ఆయన అన్నారు. శుక్ర వారం నాడు జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో ఉన్న ఆర్వీఎం మీటింగ్ హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్షా– అలీమ్ కో వారి ఆద్వర్యంలో 425 మంది దివ్యాంగ విద్యార్థులకు ఉచిత ఉపకరణాలను మంత్రి పంపిణి చేశారు.

- Advertisement -

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… విద్యార్థులకు సమైక్యరాష్ట్రంలో కనీసం తాగడానికి నీళ్ళు కూడా ఉండేవి కాదని… తెలంగాణ ఏర్పడిన తర్వాత పాఠశాలలో సకల సౌకర్యాలను కల్పించామని తెలిపారు. విద్యార్థుల దీవనలు ఈ ప్రభుత్వానికి కావాలన్నారు. దివ్యాంగుల కోసం సదరం క్యాంపులు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి దివ్యాంగులకు పర్మినెంట్ డిజేబుల్ సర్టిఫికెట్ అందించేందుకు కృషి చేస్తామన్నారు.


పిల్లలు దైవంతో సమానమని వారి వైకల్యం బాధను కలిగించినా, వారిని దైవుడిచ్చిన వరంగానే తల్లితండ్రులు భావించాలన్నారు. వైకల్యంతో ఉన్న పిల్లల తల్లితండ్రులు ఎప్పటికైనా వారు వైకల్యాన్ని జయిస్తారనే మనోదైర్యాన్ని కలిగి, పిల్లలకు అండగా ఉన్నప్పుడే మంచి ఫలితాలను సాధించగలుగుతారని అన్నారు. ఆ దిశగా మనోధైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటు వారికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని తెలిపారు.
జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్షా మహబూబ్ నగర్ వారి ఆద్వర్యంలో అలీమ్ కో ద్వారా క్రచర్స్14, రోలేటర్లు 29, ట్రై వీలర్ సైకిళ్లు 4, వీల్ చైర్లు 69, ఆర్టిఫిషియల్ లింబ్స్ 52, వినికిడి పరికరాలు 148, యంఎస్ఐడి కిట్లు 107, బ్రెయిలీ కిట్లు 2… మొత్తం 425 ఉపకారణాలను మంత్రి పంపిణి చేశారు
మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, జిల్లా విద్యాధికారి రవీందర్, సీఎంఓ బాలు యాదవ్, ఎంఈఓ మంజులాదేవి, కౌన్సిలర్లు కిషోర్ కుమార్, రామ్ లక్ష్మణ్, తిరుమల వెంకటేష్, సంధ్య శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News