Saturday, November 23, 2024
HomeతెలంగాణStrike: సమ్మె బాటలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు

Strike: సమ్మె బాటలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు

తిరుమలాయపాలెం మండల పరిధిలో ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు దిగారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సుమారు 4 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శిలందరూ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని, ఎమ్మెల్సీ తాత మధును, కలిసి వినతి పత్రం అందజేశారు. మరునాడు రెగ్యులర్ చేయాలని కెసిఆర్ కి పోస్ట్ ద్వారా లెటర్ పంపించారు. అయినా వారి రెగ్యులేషన్ పై ఎటువంటి స్పందన చర్చలు జరగకపోవడంతో సమ్మెకు దిగామని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల మండల అధ్యక్షులు వినోద్ కుమార్ అన్నారు.

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం పెద్ద గ్రామ పంచాయతీలతోపాటు తండాలను పరిపాలన సౌలభ్యం కోసం గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రెటరీ నియమించి గ్రామ అభివృద్ధికి లక్ష్యంగా చేస్తున్న సమయంలో అందరూ కలిసి బాగా కృషి చేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులలో తెలంగాణ ప్రభుత్వానికి అగ్రస్థానం నిల్చడంలో పంచాయతీ కార్యదర్శులు కీలకపాత్ర పోషించారు ఈ సందర్భంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారిని రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ని వేడు ఉన్నప్పటికీ ఎటువంటి దయ చూపట్లేదని మా కుటుంబ బాగోగుల కోసం మా కష్ట సుఖాలు గురించి ఆలోచించి మమ్ముల్ని రెగ్యులర్ చేయమని సమ్మె మా హక్కు అని చేయట్లేదు, సమ్మె మా ఆవేదన మాత్రమే వినండి కేసీఆర్ సార్ అని వినోద్ కుమార్ అన్నారు. ఈ సమ్మెలో ఉపాధ్యక్షులు రాములు,గౌర అధ్యక్షులు ఉపేందర్, అనిత ఇతర పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News