Saturday, November 15, 2025
HomeతెలంగాణGanesh Laddu: 333 కిలోల భారీ లడ్డూను దక్కించుకున్న విద్యార్థి.. ఎంతకో తెలిస్తే అవాక్కవాల్సిందే!

Ganesh Laddu: 333 కిలోల భారీ లడ్డూను దక్కించుకున్న విద్యార్థి.. ఎంతకో తెలిస్తే అవాక్కవాల్సిందే!

Ganesh laddu lucky Draw winner: వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని పొందాలంటే సాధారణంగా వేలం పాటలో పాల్గొని దక్కించుకోవాలి. నవరాత్రులు పూజలందుకున్న స్వామివారి ప్రసాదం శక్తిని సంతరించుకుంటుందనే నమ్మకంతో భక్తులు పోటీపడి మరీ దక్కించుకుంటారు. ఇటీవల ఏ గణపతి లడ్డూ చూసినా రూ.వేల నుంచి రూ.లక్షల్లోనే పలుకుతోంది. దీంతో డబ్బున్న వారికి తప్ప సామాన్య ప్రజలకు ఆ గణేష్ మహాప్రసాదం దక్కడం లేదు. ఇలాంటి వారి కోసం ఈ మధ్య కొన్ని ఉత్సవ కమిటీలు తమ తమ మండపాల వద్ద 2 లడ్డూలను ఏర్పాటు చేస్తూ… అందులో ఒకటి వేలం పాట ద్వారా, మరోటి లక్కీ డ్రా విధానంలో భక్తులకు అందిస్తున్నారు. రూ.11 రూ.51, రూ.99 వంటి నిర్ణీత మొత్తం కట్టి ఎవరైనా ఈ లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

- Advertisement -

రూ.99కే 333 కిలోల లడ్డూ: గణేష్ చవితి ప్రారంభం రోజు ఈ లక్కీ డ్రా ఏర్పాటు చేస్తారు. నవరాత్రులు ముగిసే వరకు ఆసక్తి ఉన్న భక్తులు ఆయా మండపాల వద్దకు వెళ్లి నిర్ణీత మొత్తాన్ని కట్టి తమ పేర్లు నమోదు చేసుకుంటారు. ఇక చివరి రోజు లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటిస్తారు. నవరాత్రులు పూజలందుకున్న లడ్డూను లాటరీ ద్వారా గెలుచుకున్న వారికి అందజేస్తారు. సాధారణంగా ఇలాంటి లడ్డూలు ఒకటి లేదా రెండు కిలోల నుంచి మొదలుకొని పది కిలోల వరకు ఉంటాయి. కానీ హైదరాబాద్​లోని కొత్తపేట సమీపంలో మాత్రం ఏకంగా 333 కిలోల లడ్డూను లక్కీ డ్రా పెట్టారు. అయితే ఆ భారీ లడ్డును ఓ విద్యార్థి గెలుచుకున్నాడు.

ఆనందంతో చిందులేసిన విద్యార్థి: హైదరాబాద్​లోని కొత్తపేటకు సమీపంలో గల శ్రీ ఏకదంత యూత్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేశ్​ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గణపతి వద్ద 333 కిలోల భారీ లడ్డూను ఏర్పాటు చేసి లక్కీ డ్రా నిర్వహించారు. రూ.99తో ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో సుమారు 780 టోకెన్లు విక్రయించారు. వినాయక నిమజ్జనం సంద్భంగా శనివారం లక్కీ డ్రా విజేతను ప్రకటించారు. స్థానిక విద్యార్థి సాక్షిత్​ గౌడ్​ లక్కీ డ్రాలో లడ్డూను గెలుపొందారు. దీంతో 333 కిలోల స్వామివారి మహా ప్రసాదాన్ని ఆ విద్యార్థి దక్కించుకున్నాడు. చాలా మంది రూ.లక్షల్లో వేలం పాట పాడినా లడ్డూను దక్కించుకోలేకపోతుండగా.. తనకు కేవలం రూ.99కే 333 కిలోల లడ్డూ దక్కిందని విద్యార్థి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad