Saturday, September 28, 2024
HomeతెలంగాణSulthanabad: హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల పెత్తనం వద్దు

Sulthanabad: హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల పెత్తనం వద్దు

హిందువుల ఐక్యత తోనే దేవాలయాలు..

హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల పెత్తనం ఉండవద్దని పెద్దపల్లి జిల్లా పురోహిత సంఘ పురోహితులు అన్నారు. సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రము చేసిన వారిని శిక్షించాలని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒక రోజు ధర్మదీక్ష కార్యక్రమం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి పురోహితులు శ్రీనివాసచారి, శ్రావణ్ శర్మ,రమేష్ శర్మ, శంకరా శర్మ పురోహితులు హాజరై దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులలో ఐక్యత పెరిగితే దేవాలయాల్లో ఎలాంటి మోసాలు జరగవని అందుకనే మనమందరం ఐక్యతగా ఉండాలని, తిరుమల లడ్డు అపవిత్రంపై తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా సుల్తానాబాద్ పట్టణంలో సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఒకరోజు ధర్మదీక్ష కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమని అన్నారు. అలాగే హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల పెత్తనం ఉండవద్దని సనాతన హిందూ ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని అందులో హిందూ ధర్మం కోసం పాటుపడే వాళ్ళు అలాగే సామాజిక కార్యకర్తలను ఎంచుకోవాలని అన్నారు.

తిరుమల లడ్డును అపవిత్రం చేసినవారు ఎంతటి వారైన దోషులను తక్షణమే కఠినంగా శిక్షించాలని, ఇలాంటివి పునారావృతం కాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ ,డైరెక్టర్ ముత్యాల రాధా రవీందర్, హిందూ సంఘాల నాయకులు కూకట్ల నాగరాజు. గోశాల అధక్షులు బండారి సూర్య,గుండ రవీందర్ గాలపల్లి కుమార్,రాచూరి ప్రవీణ్. ఎనగందుల సతీష్, సందీప్ శివరాత్రి ప్రసాద్ గోలి శ్రీనివాస్ ఆగండ్ల శంకర్,శెట్టి శ్రీనివాస్, జనార్ధన్,ఆరెపల్లి సర్వేశ్, సిరిపురం రమేష్, ఆడెపు శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News