Sunday, July 13, 2025
HomeతెలంగాణBetting: బెట్టింగ్ వల్ల దారుణానికి పాల్పడ్డ యువకుడు.. సొంత తండ్రినే!

Betting: బెట్టింగ్ వల్ల దారుణానికి పాల్పడ్డ యువకుడు.. సొంత తండ్రినే!

Online Betting: ఇటీవల కాలంలో బెట్టింగ్ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. అలాగే ఆ బెట్టింగ్ కారణంగా అనేక విధాలుగా ఆస్తులు కోల్పోతున్న విషయం కూడా తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా.. తెలంగాణలోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని గోపన్‌పల్లి తండాలో ఓ హృదయవిదారక ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ యువకుడిని బానిసగా మార్చేసింది. ఎంతలా అంటే చివరికి తన తండ్రినే హత్య చేయడానికి దారి తీసేంతలా.. మారింది. ఈ దారుణ సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే.. 19 ఏళ్ల రవీందర్ అనే యువకుడు గత కొంత కాలంగా బెట్టింగ్ బారిన పడ్డాడు. కుమారుడు బెట్టింగ్ ఆడడాన్ని గమనించిన తండ్రి హనుమంతు, బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, కొడుకు అడగడంతో పొలం తాకట్టు పెట్టి దాదాపు రూ. 6 లక్షల వరకు ఇచ్చాడట. కానీ ఆ మొత్తాన్ని కూడా రవీందర్ బెట్టింగ్‌లో కోల్పోయాడు. తండ్రి మందలించినా మారని కుమారుడు, చివరికి కోపంలో ఆత్మవిశ్వాసం కోల్పోయి.. తండ్రిపై కత్తితో దాడి చేశాడు. తండ్రిని హత్య చేసిన తర్వాత, తనను తాను కూడా గాయపర్చుకొని బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.

బెట్టింగ్ వ్యసనం ఎంత ప్రమాదకరమో ఈ దారుణం మరోసారి నిరూపించింది. కుటుంబ సభ్యుల మధ్య నమ్మకాన్ని ఛిన్నాభిన్నం చేయడమే కాకుండా, ప్రాణాలు తీసే స్థాయికి కూడా వెళ్తోంది. ఈజీ మనీ ఆశతో యువత ఓ అడుగు వేస్తే, దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ సంఘటన గుర్తు చేస్తోంది. పలువురు యువకులు ఈ ఊబిలో పడిపోయి అప్పుల ఊబిలో మునిగి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు కుటుంబాల ఆస్తులు నాశనం చేస్తున్నారు. ఇలా మానవ సంబంధాలను చిద్రం చేస్తూ, సమాజాన్ని కలుషితం చేస్తున్న ఈ “డిజిటల్ జూదం”పై సమర్థవంతమైన చర్యలు అవసరం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News