భారత రాష్ట్ర సమితి యువజన చొప్పదండి నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా చొప్పదండి మండలంలోని కాట్నపల్లి అనుబంధ గ్రామమైన మల్లన్న పల్లె గ్రామానికి చెందిన భక్తు విజయ్ కుమార్ ను నియమించినట్లుగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ నా జన్మదినాన్ని పురస్కరించుకొని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చేతుల మీదుగా ఆశీర్వాదాన్ని తీసుకొని, నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ చొప్పదండి నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి యువజన విభాగాన్ని నియోజకవర్గంలోని అందరి నాయకులతో కలిసి మరింత బలోపేతం చేస్తానని తెలిపారు.