Sunday, July 7, 2024
HomeతెలంగాణSunke Ravi: బీఆర్ఎస్ లో చేరికలు

Sunke Ravi: బీఆర్ఎస్ లో చేరికలు

ఆపద ఏదైనా అండ నేను

చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ… నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గతంలో స్థానికేతరులు ఎమ్మెల్యేలుగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారన్నారు. ఎన్నికల ముందు వచ్చి తర్వాత వెళ్లిపోయే నాయకులకు ఈ ప్రాంతం మీద మమకారం ఉండదు. పార్టీలకు అతీతంగా నేను అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తున్నాని అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటున్న. ఏ ఆపద వచ్చినా నేను అండగా నిలుస్తానని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News