రామడుగు మండలానికి సంబందించిన 66మంది లబ్దిదారులకు 66,07,656 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. 2014 ముందు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పు చేసి పెళ్లి చేసేవారని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా మారి ఒక్క లక్ష 116 రూపాయలను పేద ప్రజలకు చెక్కుల రూపంలో నేరుగా ఇస్తున్నామని తెలిపారు.
ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఆడబిడ్డలకు ఒక భరోసాగా ఉందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా ఇవ్వలేదని అన్నారు. భారతదేశంలో ఆడబిడ్డల పెళ్లిళ్ల కొరకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని కరోనా లాంటి సంక్షోభంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమానికే పెద్ద పీట వేశారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.