ఆరోగ్య తెలంగాణ, కులసంఘాల బలోపేతమే లక్ష్యమన్నారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. చొప్పదండి పట్టణంలోని 5వ వార్డులో అంబేద్కర్ సంఘ భవనానికి శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. పల్లెల, పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుందని, గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంతో మంచినీటిని అందిస్తున్నామని, అందని గ్రామాలకు త్వరలో అందిస్తామని అన్నారు. పల్లెలు పచ్చదనంతో ఉండేందుకు హరితహారం కార్యక్రమం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూటిక తీపించామన్నారు. నూతనంగా ఏర్పడిన గ్రామాలకు గ్రామ పంచాయితీ భవనాలను మంజూరు చేసినట్టు.. రవి శంకర్ ప్రజలకు వివరించారు.