Thursday, April 10, 2025
HomeతెలంగాణSunke Ravi: పల్లె ప్రగతితో పల్లెలు అద్దంలా మెరుస్తున్నాయ్

Sunke Ravi: పల్లె ప్రగతితో పల్లెలు అద్దంలా మెరుస్తున్నాయ్

గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంతో మంచి నీటిని అందిస్తున్నామని అందించాం

గంగాధర మండలం ముప్పిడి నరసయ్య పల్లి, లింగంపల్లి, చర్లపల్లి (ఆర్), చర్లపల్లి (ఎన్), లక్ష్మీదేవి పల్లి, ఇస్లాంపూర్, తాడి జెర్రీ, చిన్న ఆచంపల్లి గ్రామాల్లో 1కోటి 80 లక్షల రూపాయల విలువ గల నూతన గ్రామపంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లెల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుందని అన్నారు. గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంతో మంచి నీటిని అందిస్తున్నామని అందని గ్రామాలకు త్వరలో అందిస్తామని అన్నారు.

- Advertisement -

పల్లెలు పచ్చదనంతో ఉండేందుకు హరితహారం కార్యక్రమం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా ఏర్పడ్డ గ్రామాలకు గ్రామ పంచాయితీ భవనాలను మంజూరు చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు ఎంపీపీలు అధికారులు తదతరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News