బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో 9500 మంది రైతులకు 8కోట్ల 16లక్షల రూపాయల నష్టపరిహారం త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో గత వడగండ్ల వానలకు నష్టపోయిన 4000 మంది రైతులు 3500 ఎకరాలకు 3 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరయ్యాయని త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఎకరానికి 20000 దమ్ముంటే తీసుకురావాలని బండి సంజయ్ కి సవాల్ విసిరారు. బిజెపి పాలిత ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలే లేవని దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామ గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు.
రైతుల కోసం నిర్మించిన రైతు కల్లాల నిధులను 150 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు వాపస్ తీసుకుందో దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. గత నెలలో వడగండ్ల వర్షాల సమయంలో పంటలు ఇంకా కోతలకు కూడా రాలేదని బండి సంజయ్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదనడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. ఎరువులు, విత్తనాల ధరలు పెంచింది బిజెపి కేంద్ర ప్రభుత్వమేనని రైతులు దేశ రాజధాని ఢిల్లీలో మద్దతు ధరల గురించి ధర్నా చేస్తే లాఠీ ఛార్జ్, బాష్పవాయువు గోలాలతో,రబ్బరు బుల్లెట్లతో చంపించిన ఘణుడు మోడీదే అన్నారు. దేశంలో వర్షాలకు నష్టపోయిన రైతులకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం ప్రకటించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 10వేల రూపాయల చొప్పున ఆదుకుంటామని ప్రకటించారన్నారు. రైతులు ఆందోళన చెందవద్దు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.