Saturday, November 15, 2025
HomeTop StoriesSupreme Court: రేవంత్ సర్కార్‌కు బిగ్‌ షాక్‌.. ఎస్ఎల్‌పీని కొట్టేసిన సుప్రీంకోర్టు

Supreme Court: రేవంత్ సర్కార్‌కు బిగ్‌ షాక్‌.. ఎస్ఎల్‌పీని కొట్టేసిన సుప్రీంకోర్టు

BC reservation: బీసీ రిజర్వేషన్ల అంశంలో రేవంత్ సర్కార్‌కు బిగ్‌ షాక్ తగిలింది. హైకోర్టు స్టేను ఎత్తేయాలని దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను భారత సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. వాడి వేడి వాదనల అనంతరం పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులోనే తేల్చుకుని రావాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తమ తీర్పుతో హైకోర్టు విచారణపై ప్రభావం పడొచ్చని ధర్మాసనం పేర్కొంది. ఈ దశలో పిటిషన్‌ను స్వీకరించబోమని చెబుతూ ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

- Advertisement -

వాడి వేడి వాదనలు: బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని రేవంత్ సర్కారు తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయని అన్నారు. శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించకే.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఇదే అంశాన్ని స్పష్టం చేసిందని అభిషేక్ సింఘ్వీ తన వాదనలను వినిపించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం సర్వే నిర్వహించిందని అన్నారు. గవర్నర్ బిల్లు పెండింగ్లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అభిషేక్ సింఘ్వీ వాదించారు. రిజర్వేషన్లను పెంచుకునే సౌలభ్యం ఇందిరా సహాన్ని జడ్జిమెంట్‌లో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు అంశాన్ని అభిషేక్ సింఘ్వీ ధర్మాసనం ముందు గుర్తుచేశారు. సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు.

హైకోర్టులోనే తేల్చుకోండి: ప్రభుత్వం తరపు వాదనలు విన్న ధర్మాసనం.. స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను కొట్టేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులోనే తేల్చుకుని రావాలని పేర్కొంది. తమ తీర్పుతో హైకోర్టు విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ దశలో పిటిషన్‌ను స్వీకరించబోమని చెబుతూ ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

మెరిట్స్​ ప్రకారం విచారించండి: సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని హైకోర్టుకు భారత సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. మెరిట్స్​ ప్రకారం విచారణ కొనసాగించాలని హైకోర్టుకు తెలిపింది. కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్లపై ఎన్నికలకు వెళ్లవచ్చని సూచనలు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad