ఇటీవల తెలంగాణలో రాజకీయ దుమారం రేపిన కంచ గచ్చిబౌలి భూముల(Kancha Gachibowli)వ్యవహారంపై సుప్రీంకోర్టులో(Supreme court) విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? లేదా? అనేది స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. లాంగ్ వీకెండ్ చూసి ఎందుకు చర్యలు మొదలు పెట్టారని ప్రశ్నించారు.
పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలను స్పష్టంగా చెప్పాలన్నారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్ది బుల్డోజర్లు చెట్లను తొలగించేందుకు ఉపయోగించారని మండిపడ్డారు. పర్యావరణాన్ని పునరుద్దరించకపోతే జైలుకు వెళ్లాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులను హెచ్చరించారు. అనంతరం తదుపరి విచారణను జులై 23కి సుప్రీంకోర్టు వాయిదా వేశారు. కాగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు.