Sunday, October 6, 2024
HomeతెలంగాణSuryapet: ప్రచారం ప్రారంభించిన చల్లా శ్రీలత

Suryapet: ప్రచారం ప్రారంభించిన చల్లా శ్రీలత

ఆడబిడ్డకు అపురూప స్వాగతం

హుజూర్ నగర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా శ్రీలతా రెడ్డి పాత నేరేడుచర్లలోని ఉభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యకర్తల కోలహాలం మధ్య ప్రజల ఆశీర్వాదాలతో కుటుంబ సభ్యులతో కలిసి ప్రచార రథాలకు వాహన పూజ చేశారు. అనంతరం నేరేడుచర్ల మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. శ్రీలతా రెడ్డి నేరేడుచర్ల ఆడబిడ్డ కావడంతో మహిళలల నుండి అపూర్వ స్పందన లభించింది.

- Advertisement -

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యులు బాల వెంకటేశ్వర్లు,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అంబాల నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు, నేరేడుచర్ల పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొణతం నాగిరెడ్డి, మండల అధ్యక్షులు విజయ్ కుమార్, విజయ్ భాస్కర్ రెడ్డి, అంజయ్య, కోటిరెడ్డి,నాయకులు కొండ హరీష్, కిరణ్, విజయ్ రెడ్డి, సైదులు, జనగల శ్రీను, కుక్కుటపు వెంకటేశ్వర్లు, సతీష్, పగిడి శ్రీనివాస్, అంబటి వేణు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News